SC, ST Act క్రైస్తవ మతం - "చట్టంపై అవగాహన కోసం"

మతం మారిన షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తి షెడ్యూల్డు కులాల వ్యక్తిగా పరిగణింపజాలడని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1977 లో తీర్పునిచ్చింది. (Alt 1977,282) క్రైస్తవ మతాన్ని స్వీకరించిన షెడ్యూల్డు కులాలవారు షెడ్యూల్డు కులాల ప్రయోజనాలను పోందజాలరని సుప్రీంకోర్టు 1986 లో తీర్పునిచ్చింది ( Alt 1986, Sc. 733).

  • నీ భార్య గాని, తల్లి గానీ, కుమార్తె గానీ క్రైస్తవ కూటములు వెళుతున్నారా? వీరికి మనోవర్తి చెల్లించనక్కరలేదు సెక్షన్ 18(3) of Act 78 of 1956.
  • నీ కొడుకు గానీ, కోడలు గానీ ఇతర మతం పుచ్చుకున్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్థిలోగాని, మరి ఏ ఇతర హిందూ బంధువుల నుండి గాని, వారసత్వపు హక్కుగాని, వాటా పంచమని అడిగే హక్కుగాని లేదు.
  • తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు, పిల్లల ఆస్థికి గార్డియన్ గా ( సంరక్షకులుగా) ఉండే హక్కు కోల్పోతారు ( సెక్షన్ 6 హిందూ మైనార్టి & గార్డియన్ షిప్ చట్టం) అటువంటప్పుడు దగ్గర బంధువులు గానీ, చుట్టు ప్రక్కల హిందువులు గానీ స్వచ్చందంగా ముందుకు వస్తే సంబంధిత జిల్లా కోర్టు ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతే కాదు పిల్లలను మతం మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే ముందుగా ఎవరైనా కోర్టుకు వస్తే మైనర్లను మతం మార్చకుండా సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఉంది.
  • క్రైస్తవ మతం స్వీకరించిన BC (A-B-D) గ్రూపులవారు OC లుగా పరిగణించబడతారు. ఇదేవిథంగా క్రైస్తవ మతం స్వీకరించిన SC లు BC (C) లుగా పరిగణించబడతారు. ముస్లిం మతం పుచ్చుకున్న SC లు OC లుగా, అలాగే క్రైస్తవ లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న ST లు OC లుగా పరిగణింపబడతారు. G.O.M. S.No. 1973 ( Education Depot. Dt.23-09-1970)
  • SC, ST ,కోటాలో ఉద్యోగం సంపాదించిన తరువాత మతం మారి చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తే BC (C) లుగా అవుతారు.
  • IPC 153 (బి) ప్రకారం జాతీయ సమగ్రత విషయంలో విదేశీయులను, విదేశీ మతాలను పొగుడుతూ జాతీయ సమగ్రతపై నమ్మకం , విశ్వాసం లోపించేలా దేశ సార్వభౌమాధికారం, దేశ సమగ్రతపై విధేయత కోల్పోయేలా ఉపన్యాసాలు, రచనలు, ప్రకటనలు చేసినా ప్రజల మథ్య అపోహలు, విద్వేషాలు రగిలించి శతృత్వభావం పెంచడం చేస్తే మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండూ విథించవచ్చు.
  • G.O Ms No. 376 Dated 29-11-2012, Andhra Pradesh Act 13 of 1994 జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా మత సంబంధ కట్టడములు నిషేధము.
  • క్రైస్తవ మతం స్వీకరించిన SC, ST లు రిజర్వు స్థానాల్లో పోటీ చెయ్యడానికి అవకాశం లేదు. వారు BCలుగా జనరల్ లేదా BC రిజర్వ్ స్థానాల్లోనే పోటీ చేయవలసి ఉంటుంది.
  • క్రైస్తవ మతం స్వీకరించిన SC, ST లు ఇతరులపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టుటకు అనర్హులు.
  • 1976 సం. నుండి మన దేశంలో విదేశీ విరాళము నియంత్రణ చట్టం (ACT 49/1976) అమలులో ఉంది. స్వచ్చంద సేవా సంస్థల పేరుతో ఇతర దేశాల నుండి వస్తున్న డబ్బు మా మార్పిడులకు ఉపయోగించడం ఈ చట్ట ప్రకారం నేరం.
  • ప్రార్థనలతో , కొబ్బరి నూనెతో రోగాలు నయం చేస్తాం అంటూ ప్రచారం చేయడం డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ ACT No. 21 of 1954, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 2008 ప్రకారం నేరం.

Comments

Popular posts from this blog

Really RAVANA is Dalit or Brahmin ? Ravana's birth History